స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండ‌టంతో మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మై... స్వల్ప లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఆక‌ర్షణీయ లాభాల‌తో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ప్రధాన మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నాయి. రియ‌ల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోంద‌ని గ‌మ‌నించిన చైనా... మ‌రింత స్టెముల‌స్‌కు వెన‌క‌డుగువేస్తోంది. మ‌రోవైపు  చ‌మురు ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. ఈ  నేప‌థ్యంలో మ‌న నిఫ్టి 11601 వ‌ద్ద ప్రారంభమై.. అదే స్థాయిలో కొన‌సాగుతోంది. చ‌మురు మార్కెటింగ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టి ప్రధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌.... ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, ఐఓసీ, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్. నిఫ్టిలో టాప్ లూజ‌ర్స్‌... టాటా మోటార్స్‌, గ్రాసిం, హీరో మోటో కార్ప్‌, మారుతీ, వేదాంత. కంపెనీకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ ఆస్తుల‌ను బ్లాక్ స్టోన్‌కు విక్రయించ‌నున్నట్లు వార్తలు రావ‌డంతో ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్ షేర్లు ఏడు శాతంపైగా లాభంతో ట్రేడ‌వుతున్నాయి.

సెన్సెక్స్ టాప్‌గెయిన‌ర్స్ః ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, కోర‌మాండ‌ల్‌, రియ‌ల‌న్స్ నిప్పాన్ లైఫ్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, సుజ్లాన్‌.

సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్ః టాటా స్టీల్ (పీపీ), ఆర్ కామ్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌, సింఫ‌ని