భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభం

భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభం

అంత‌ర్జాతీయ మార్కెట్ల సానుకూల‌త‌తో పాటు విదేశీ ఇన్వెస్ట‌ర్ల కొనుగోళ్ళ‌తో భార‌త మార్కెట్ల‌లో ర్యాలీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం 97 పాయింట్ల లాభంతో 11523 పాయింట్ల వ‌ద్ద నిఫ్టి ట్రేడ‌వుతోంది. అధిక స్థాయిలో షార్టింగ్‌కు పాల్ప‌డిన‌వారు తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి ప్యూచ‌ర్‌కు ఎక్క‌డా ఒత్తిడి రాకుండా విదేశీ ఇన్వెస్ట‌ర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ వారం హోలి పండుగ ఉండ‌టంతో మార్కెట్‌కు సెల‌వు. ఈ లెక్కన ఈనెల డెరివేటివ్స్ క్లోజింగ్‌కు కేవ‌లం 8 ట్రేడింగ్ రోజులే ఉండ‌టంతో షార్టింగ్ పాల్ప‌డిన  ఇన్వెస్ట‌ర్లు  క‌వ‌రింగ్‌కు పాల్ప‌డితే మార్కెట్ మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. ఒక రోజు బ్యాంకు నిఫ్టి, మ‌రో రోజు ఇత‌ర షేర్లు లెక్క‌న నిఫ్టి పెరుగుతోంది.

శుక్ర‌వారం యూరో, అమెరికా మార్కెట్లు లాభాల్లో క్లోజ్ కాగా, చైనా, అమెరికా వాణిజ్య చ‌ర్చ‌ల‌పై ఆశ‌ల‌తో ఇవాళ ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 69ని బ్రేక్ చేసి మ‌రింత దిగువ‌కు వచ్చింది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఐఓసీ, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, కొట‌క్ బ్యాంక్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌లో మారుతీ, గ్రాసిం, వేదాంత‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐష‌ర్ మోటార్స్ ఉన్నాయి.   బీఎస్ఈలో బాంబే డైయింగ్‌, ప్రిస్టేజి, సుంద‌రం ఫాజ‌న‌ర్స్ లాభాల్లో ముందున్నాయి.