నిలకడగా ప్రారంభమైన మార్కెట్‌

నిలకడగా ప్రారంభమైన మార్కెట్‌
వరుసగా పదో రోజు కూడా మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా గ్రీన్‌ లో ఉండటంతో నిఫ్టి ఆరంభంలోనే 10570ని దాటింది. సెన్సెక్స్ కూడా వంద పాయింట్ల దాకా లాభంతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టి 50లో విప్రో దాదాపు రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అల్ర్టాటెక్ సిమెంట్‌, గెయిల్ షేర్లు లాభాలో ట్రేడవుతున్నాయి. ఇక నష్టాలతో ట్రేడవుతున్న నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌ ముందంది. ఈ షేర్ ఒక శాతంపైగా నష్టంతో రూ. 406 వద్ద ట్రేడవుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐఓసీ, కొటక్‌ బ్యాంక్‌ తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ నష్టాలతో ట్రేడవుతున్నాయి.