భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

స్టాక్ మార్కెట్ ప్రి ఎల‌క్ష‌న్ ర్యాలీ జోరుగా సాగుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండ‌టంతో నిఫ్టి రికార్డుస్థాయిలో ఓపెనింగ్‌లో 11,410కి చేరింది. ప్ర‌స్తుతం 62 పాయింట్ల లాభంతో 11402 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. సెన్సెక్స్ 208 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. జ‌పాన్‌, చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్ల‌న్నీ ఒక శాతం లాభంతో ట్రేడ‌వుతున్నాయి.  రూపాయి ఇవాళ మ‌రింత బ‌ల‌ప‌డి 69.27కు చేరింది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో బ్యాంకు షేర్ల హ‌వా కొన‌సాగుతోంది. చాలా త‌క్కువ కాలంలోనే ఎస్‌బీఐ రూ. 295ని దాటింది. ప్ర‌ధానంగా ప్రైవేట్ బ్యాంకు షేర్లు భారీగా పెరుగుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఇండస్ ఇండ్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గెయిల్‌, టైటాన్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి.  న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో హిందుస్థాన్ లీవ‌ర్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కోల్ ఇండియా, భార‌తీ ఎయిర్ టెల్‌, ఐటీసీ ఉన్నాయి.  ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ 5శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.