మార్కెట్‌ః నిలకడగా ప్రారంభం

మార్కెట్‌ః నిలకడగా ప్రారంభం

మార్కెట్‌ అప్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతుండటంతో మన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న భారీ లాభాలు పొందిన సూచీలు ఇవాళ స్వల్ప లాభాతో ప్రారంభమయ్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో  ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌, చైనా మార్కెట్లు ఒక శాతంపైగా లాభపడగా, ఇతర మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి స్వల్పంగా లాభపడి 10,730 వద్ద ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ ఏకంగా నాలుగు శాతం లాభంతో ఓపెనైంది. బ్యాంక్‌ నికర లాభం మార్కట్‌ అంచనాల కన్నా అధికంగా ఉన్నందున ఈ కౌంటర్లో కొనుగోళ్ళ మద్దతు అందింది. నిఫ్టి షేర్లలో లుపిన్‌ ఒక శాతం లాభపడగా, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, సిప్లా షేర్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి.  ఇక నిఫ్టి షేర్లలో ఇన్ఫోసిస్‌ ఒక శాతం నష్టంతో ట్రేడవుతుండగా... ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, హిందుస్థాన్‌ లీవర్‌, గెయిల్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.