లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

అవిశ్వసం తీర్మానాన్ని స్టాక్‌ మార్కెట్లు పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. ఉదయం ఆసియా మార్కెట్లకు అనుగుణంగా నష్టాల్లో జారి కొన్ని నిమిషాల్లో మళ్ళీ లాభాల్లోకి వచ్చింది నిఫ్టి ప్రస్తుతం 10,999 వద్ద ట్రేడవుతోంది. ఐటీ షేర్లు వెలుగులో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ట్రేడింగ్‌ నిస్తేజంగా ఉంది. మన మార్కెట్లలో మెటల్‌ షేర్లు డల్‌గా ఉన్నాయి. ఇతర సూచీల్లో పెద్దగా మార్పుల్లేవ్‌. మంచి పనితీరు కనబర్చిన బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నాలుగు శాతం దాకా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు రెండు శాతంపైగా పెరిగాయి. ఐసీసీఐసీ బ్యాంక్‌ కూడా రెండు శాతం పైగా లాభపడింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో వేదాంత ఉంది. ఇక ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ,  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ కూడా రెండు శాతం దాకా నష్టపోయాయి.