కొనసాగిన లాభాల ట్రెండ్‌

కొనసాగిన లాభాల ట్రెండ్‌

కొద్ది కొద్దిగా.. రోజూ.. ఇలాగే నిఫ్టి ముందుకు సాగుతోంది. వారం రోజుల నుంచి ఓపెనింగ్‌లో  స్థిరంగా లేదా బలహీనంగా  ఉండటం మిడ్‌ సెషన్‌కల్లా మరింత తగ్గి.. తరవాత పుంజుకోవడం ఆనవాయితీగా మారింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇవాళ47 పాయింట్ల లాభంతో 1690 వద్ద ముగిసింది. ఉదయం కేవలం 24 పాయింట్ల లాభంతో 11667 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొద్దిసేపటికే 11648కి క్షీణించింది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది.  మిడ్ సెషన్‌ 11666 ప్రాంతానికి క్షీణించినా.. అక్కడి నుంచి తేరుకుని 11704ని దాటింది. క్లోజంగ్‌లో స్వల్పంగా క్షీణించి 11690 వద్ద ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా మోటార్స్‌ ఇవాళ రికార్డు స్థాయిలో 7 శాతంపైగా పెరిగి రూ. 232 వద్ద ముగిసింది. టీసీఎస్‌ 5 శాతం, కోల్‌ ఇండియా నాలుగు శాతం పెరిగాయి. తరవాతి స్థానాల్లో ఉన్న టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంకులు ఉన్నాయి. నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌గా ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, గెయిల్‌, ఎస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో పీసీ జ్యువల్లర్స్‌ 14 శాతం లాభంతో టాప్‌  గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానంలో టాటా స్టీల్‌ (పీపీ), స్పైస్‌ జెట్‌, ఇన్ఫీబీమ్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ నిలిచాయి.  సెన్సెక్స్‌లో టాప్‌ లూజర్స్‌గా టీవీ18 బ్రాడ్‌కాస్టింగ్‌, ఆర్‌ కామ్‌, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, నెట్‌వర్క్‌ 18, వాక్రంగీ ఉన్నాయి.