భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితి నుంచి ఇపుడిపుడే బయటపడుతున్నాయి. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ నుంచి యూరో మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా మార్కెట్లో ప్రతికూల వార్తలు ఉన్నా... గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. నిఫ్టి ఇవాళ ఉదయం 25 పాతిక పాయింట్ల లాభంతో ప్రారంభమైనా...స్వల్ప నష్టంతో 11,483 కనిష్ఠ స్థాయిని తాకింది. తరవాత పుంజుకున్న మార్కెట్‌ 11,281 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత వంద పాయింట్ల లాభంతో 11,257 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏకంగా 9 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, టాప్‌ గెయినర్స్‌లో బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐఓసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లు ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌లో ఎస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, కోల్‌ ఇండియా షేర్లు ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, టాటా గ్లోబల్‌, హెచ్‌సీసీ, టాటా కెమికల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ లూజర్స్‌లో ఇండిగో, మిందా ఇండస్ట్రీస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడియా, వెస్ట్‌ లైఫ్‌ ఉన్నాయి.