లాభాలతో ముగిసిన నిఫ్టి

లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, రూపాయి బలంతో ఇవాళ నిఫ్టి లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగిన నిఫ్టి...  65 పాయింట్లతో ముగిసింది. సెన్సెక్స్‌ 196 పాయింట్లు పెరిగింది.  డాలర్‌ స్థిరంగా ఉండగా, ముడి చమురు ధరలు ఇవాళ కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి.ఉదయం ఆసియా మార్కెట్లలో నిక్కీ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో మొదలైనయూరో మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ గొడవను మార్కెట్లు  పెద్దగా పట్టించుకోలేదు.  నిఫ్టి ప్రధాన షేర్లలో  భారతీ ఎయిల్‌ టెల్‌ ఏకంగా 9 శాతం లాభం పొందగా, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు మూడు శాతంపైగా లాభపడ్డాయి. రిలయన్స్‌  2.57 శాతం లాభంతో ముగిసింది. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఎస్‌ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. ఈ షేర్‌ ఆరున్నర శాతం క్షీణించగా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నాలుగు శాతం క్షీణించింది. జేఎస్‌ డబ్ల్యు స్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌ రెండు శాతంపైగా నష్టపోయాయి. ఇతర షేర్లలో జెట్‌ ఎయిర్ వేస్‌ 6 శాతంపైగా లాభడింది. ఈ కంపెనీ టేకోవర్‌ ప్రతిపాదనను ఇవాళ టాటా సన్స్‌ బోర్డు చర్చించనుంది. ఈ నేపథ్యంలో నిన్న 26 శాతం, ఇవాళ ఆరు శాతంపైగా పెరిగింది ఈ కంపెనీ షేర్‌. ఇక ఇన్ఫీబీమ్‌ షేర్‌ 12 వాతం దాకా నష్టపోగా, ఐడియా 15 శాతం పెరిగింది.