కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదరడంతో ప్రపంచ స్టాక్‌, కమాడిటీ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఉదయం ఆసియా నుంచి మొదలైన షేర్‌ మార్కెట్ల పతనం అమెరికా మార్కెట్ల ప్రారంభ సమయానికి తీవ్రమైంది. ఉదయం ఆసియా మార్కెట్లలో కీలక మార్కెట్లన్నీ ఒక శాతంపైగా నష్టపోయాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా ఇప్పటి వరకు పరిమిత నష్టాల్లో ఉన్నా... అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించడంతో ప్రస్తుతం ఒకటిన్నర నుంచి రెండు శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు ప్రారంభానికి ఇంకా అర గంట సమయం ఉన్నా... ఫ్యూచర్‌ సూచీలు దారుణంగా పడ్డాయి. డౌ జోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500తో పాటు టెక్నాలజీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌ సూచీలు రెండు శాతం పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.