12,000 స్థాయి దాటిన‌ నిఫ్టి

 12,000 స్థాయి దాటిన‌ నిఫ్టి

ఎన్నిక‌ల ఫ‌లితాల జోష్ మార్కెట్‌లో కొన‌సాగుతోంది. కొత్త కేబినెట్ ఏర్పడ‌టంతో పాటు అమిత్ షా ఆర్థిక మంత్రిగా వ‌స్తార‌న్న వార్తల‌తో నిఫ్టి కొత్త గ‌రిష్ఠ స్థాయిల‌ను తాకుతోంది. ప్రస్తుతం 79 పాయింట్ల లాభంతో 12,024 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడ‌వుతోంది. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు రాత్రికూడా మూడు శాతంపైగా క్షీణించాయి. ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్ క్షీణించడం కూడా మార్కెట్‌కు అనుకూలంగా ఉంది. మెక్సోకో పై కూడా ఆర్థిక సుంకాలు వేస్తాన‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరిక‌ల‌తో అంత‌ర్జాతీయ మార్కెట్లలో టెన్షన్ నెల‌కొంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాల‌తో క్లోజ్ కాగా, ఆసియా మార్కెట్లు కూడా గ్రీన‌లో ఉన్నా...నామ మాత్రపు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్లలో బీపీసీఎల్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, ఐఓసీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. ఇక నిఫ్టిలో టాప్ లూజ‌ర్స్ గా ఉన్న షేర్లు... గ్రాసిం, స‌న్ ఫార్మా, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఐష‌ర్ మోటార్స్‌, వేదాంత ఉన్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన్స్‌గా ఉన్న షేర్లు... బెర్జ‌ర్ పెయింట్స్‌, జై కార్పొరేష‌న్, నౌక‌రీ, శ్రీ‌రామ్‌ ట్రాన్స్ ఫిన్‌, అపోలో హాస్పిట‌ల్స్.
సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో ఎన్‌సీసీ, మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, జైన్ ఇరిగేష‌న్ సిస్ట‌మ్స్‌, ఇన్ఫీ బీమ్‌, ఈఐ హోట‌ల్స్ షేర్లు ఉన్నాయి.