భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల‌తో ప్రారంభ‌మౌతున్నాయి. ఇదే ఉత్సాహంతో మ‌న మార్కెట్లు కూడా భారీ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఏకంగా 90 పాయింట్ల‌కుపైగా లాభ‌ప‌డింది. నిఫ్టి ప్రస్తుతం 11,950 పాయింట్ల వ‌ద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 276 పాయింట్లు లాభంతో ట్రేడ‌వుతోంది. మెక్సికో ఆంక్షలు వేయాల‌న్న ప్రతిపాద‌న‌ను అమెరికా ఎత్తివేయ‌డంతో  శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. క్రూడ్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. డాల‌ర్‌తో రూపాయి విలువ స్థిరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో నిఫ్టి ప్రధాన  షేర్ల‌లో ఎస్ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, బ్రిటానియా, వేదాంత షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో ఐఓసీ, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, యూపీఎల్ ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచిన షేర్ల‌లో దీవాన్ ఫైనాన్స్‌, హనీవెల్ ఆటోమేష‌న్‌, ఎస్ బ్యాంక్‌, శ్రీ రామ్ సిటీ యూనియ‌న్‌, ఓరియంట‌ల్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్ షేర్లు ఇవి... జ‌మ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌, రిల‌య‌న్స్ ప‌వ‌ర్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, జోట్ ఎయిర్‌వేస్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌.