లాభాల్లో ప్రారంభ‌మైన మార్కెట్‌

లాభాల్లో ప్రారంభ‌మైన మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా లాభ‌ప‌డ్డాయి. క్రూడ్ ఆయిల్  కూడా పెరుగుతోంది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అమెరికా, చైనా దేశాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వచ్చిన‌ట్లు క‌న్పిస్తోంది. దీంతోచైనా సూచీలు ఆక‌ర్ష‌ణీయంగా ట్రేడ‌వుతున్నాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో  మ‌న మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల్లో ప్రారంభ‌మైనా అధిక స్థాయిల వ‌ద్ద ఒత్తిడి వ‌స్తోంది. 10840 నుంచి 10870 మ‌ధ్య నిఫ్టి క‌ద‌లాడుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయింట్ల‌కు పైగా లాభంతో ఉంది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకు షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్షోపిస్ టాప్ గెయిన‌ర్‌గా ఉంది. ఫ‌లితాల‌తో పాటు షేర్ల బైబ్యాక్‌పై కంపెనీ నిర్ణ‌యం తీసుకోనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్‌, యూపీఎల్‌, టాటా కెమిక‌ల్స్‌, టెక్ మ‌హీంద్రా, కొట‌క్ బ్యాంక్ వెలుగులో ఉన్నాయి.  ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, ఎస్ బ్యాంక్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బ‌జాజ్ ఆటో ఉన్నాయి.