లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

ఆర్బీఐ బోర్డు స‌మావేశం దృష్ట్యా మార్కెట్‌లో టెన్ష‌న్ నెల‌కొంది. ఎన్‌బీఎఫ్‌సీల‌కు నిధుల విడుద‌ల‌తోపాటు ఆర్బీఐ వ‌ద్ద భారీ స్థాయిలో నిధుల అవ‌స‌రమా అన్న అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇవాళ బోర్డు స‌మావేశం అవుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు స్త‌బ్దుగా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్ప‌లు లేదు,. అలాగే ఉద‌యం నుంచి ఆసియా మార్క‌ట్ల‌దీ అదే తీరు. ముడి చ‌మురు ధ‌ర‌ల్లో అప్ ట్రెండ్ కొనసాగుతోంది.  డాల‌ర్ మాత్రం కాస్త బ‌ల‌హీనంగా ఉంది. దీంతో రూపాయి కూడా స్థిరంగా ట్రేడ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం 10730 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎస్ బ్యాంక్ స్వ‌ల్ప లాభంతో ట్రేడ‌వుతోంది.ఈ కౌంట‌ర్లో ఇటీవ‌ల భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌చ్చింది. ఐష‌ర్ మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో  భార‌తీ ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ ఉన్నాయి.  ఇత‌ర షేర్ల‌లో ఐడియా 5 శాతం క్షీణించ‌గా, జెట్ ఎయిర్‌వేస్ 7 శాతం దాకా న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి.