పదో రోజు లాభాల్లో నిఫ్టి

 పదో రోజు లాభాల్లో నిఫ్టి

వరుసగా తొమ్మిది రోజులు నష్టాల్లో ముగిసిన నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై... లాభాల్లో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 3 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి .. తరవాత కోలుకుని ఏకంగా 150 పాయింట్ల వరకు లాభపడి... 11,294 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. 2.40 గంటల సమయంలో అకస్మాత్తుగా నిప్టిలో వచ్చిన అమ్మకాల కారణంగా ఏకంగా వంద పాయింట్లు నష్టపోయి 11,108 క్షీణించిన నిఫ్టి... ఆ స్థాయిలో  మద్దతు 110 పాయింట్లు కోలుకుంది. క్లోజింగ్‌లో 73 పాయింట్ల లాభంతో 11,222 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 227 పాయింట్లు లాభపడింది.  అమెరికా వస్తువులపై చైనా కూడా సుంకాలు విధించడంతో ఇవాళ ఉదయం చైనా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. కాని ఆ లాభాలు ఎంతోసేపు నిలబడలేదు. మెజారిటీ ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో ఒక్కసారిగా సీన్‌ మారింది. యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమై.. అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇవాళ మన మార్కెట్‌లో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో  టాప్‌ గెయినర్స్‌గా ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, వేదాంత, గెయిల్‌ నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌... డెల్టా కార్ప్‌, డీసీఎం శ్రీరామ్‌, ఐఐఎఫ్‌ఎల్‌, మన్నపురం ఫైనాన్స్‌ ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌, స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌, సెయిల్‌, సింఫనీ, ఆర్‌ కామ్‌ ఉన్నాయి.