నిలకడగా మార్కెట్లు ప్రారంభం

నిలకడగా మార్కెట్లు ప్రారంభం

అంతర్జాతీయ మార్కట్లు నిస్తేజంగా ఉన్నా మన మార్కెట్లు నిలకడగా ప్రారంభమైంది. జూన్‌ సిరీస్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఈనెల ప్రీమియం తగ్గే అవకాశమున్నందున... వెంటనే పొజిషన్స్‌ తీసుకునేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో క్లోజ్‌ కాగా... ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తమౌతోంది.  లాభనష్టాల్లో పెద్ద తేడా లేదు. నిఫ్టి దాదాపు క్రితం ముగింపు 10750 ప్రాంతంలో ట్రేడవుతోంది. నిఫ్టి షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ 4 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో ఓఎన్‌జీసీ రెండున్నర శాతం నష్టంతో టాప్‌లో ఉంది.  కొటక్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో నష్టాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈలో సీజీ పవర్‌ 6 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియా బుల్స్‌ వెంచర్స్‌, వాఖంగ్రే సాఫ్ట్‌వేర్‌, ప్రిస్టేట్‌ షేర్లు మూడు  శాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయినవాటిలో ఆర్‌ కామ్‌ ముందుంది. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన  ఈ షేర్‌ ఇవాళ 7 శాతం నష్టంతో ట్రేడవుతోంది.