స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు నెగిటివ్‌గా ఉన్న మ‌న మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభ‌మ‌య్యాయి. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు  భారీన‌ష్టాల‌తో ముగిశాయి. నాస్‌డాక్ ఏకంగా రెండు శాతంపైగా న‌ష్ట‌పోయింది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా న‌ష్టాల్లో ఉన్నాయి. జ‌పాన్‌, హాంగ్‌సెంగ్‌లు మాత్రం స్వ‌ల్ప లాభంతో ట్రేడ‌వుతున్నాయి. ఛైనా మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి ప్ర‌స్తుతం 34 పాయింట్ల లాభంతో 10050పైన ట్రేడ‌వుతోంది. ఫార్మా రంగ సూచీ రెండు శాతంపైగా పెరిగింది. న‌ష్టాలు పెద్ద‌గా లేకున్నా.. అంత‌ర్జాతీయ మార్కెట్ల టెన్ష‌న్ మార్కెట్‌లో క‌న్పిస్తోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లోలాభాల‌తో ట్రేడ‌వుతున్న షేర్ల‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్స్ ఫైనాన్స్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, హీరో మోటోకార్ప్‌, గ్రాసిం ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, కొట‌క్ బ్యాంక్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి.