'నాకే ఓటర్‌ స్లిప్‌ రాలేదు.. సామాన్యుల పరిస్థితేంటి..?'

'నాకే ఓటర్‌ స్లిప్‌ రాలేదు.. సామాన్యుల పరిస్థితేంటి..?'

ఓటరు స్లిప్పులు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. తనకే ఓటరు స్లిప్పు రాలేదని.. ఇక సామాన్య ఓటరు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ నిర్వహించిన భేటీ ముగిసిన అనంతరం మర్రి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని..  ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంతో కలిసి కుట్ర చేస్తోందని ఆరోపించారు. 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని.. ఎన్నికల అధికారుల దృష్టికి కేసులను తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని మర్రి స్పష్టం చేశారు.