ఇది పెళ్లిళ్ల సీజ‌న్ గురూ!

ఇది పెళ్లిళ్ల సీజ‌న్ గురూ!

అవును.. ఇది పెళ్లిళ్ల సీజ‌న్‌. టాలీవుడ్‌లో వ‌రుస‌గా పెళ్లి కాన్సెప్టు సినిమాలు రిలీజ‌వుతున్నాయ్‌. ఇటీవ‌లే నిహారిక - సుమంత్ అశ్విన్ జంట‌గా న‌టించిన `హ్యాపి వెడ్డింగ్` రిలీజైంది. ఇది పెళ్లి కాన్సెప్టు సినిమా. పెళ్లికి ముందు.. నిశ్చితార్థం వ‌ర‌కూ యువ‌జంట మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుందో తెర‌పై ఆవిష్క‌రించారు. ఈ సినిమా యావ‌రేజ్ అన్న టాక్ వినిపించింది. ఆ సినిమా త‌ర్వాత ఇమ్మీడియ‌ట్‌గా సుశాంత్ న‌టించిన  `చి.ల‌.సౌ` రిలీజ‌వుతోంది. పెళ్లి అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కి ఈ సినిమా ఆగ‌స్టు 3న ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజవుతోంది. అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ ఎట్టిప‌రిస్థితిలో హిట్టు కొట్టి ట్రాక్‌లోకి వ‌చ్చేందుకు త‌పిస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా సుశాంత్‌కి ప్ర‌మోష‌న్ చేయ‌డంతో ఆస‌క్తి రెట్టించింది. 

ఈ కేట‌గిరీలోనే టైటిల్‌లోనే క‌ళ్యాణంతో బ‌రిలో దిగుతున్న‌ మ‌రో సినిమా- శ్రీ‌నివాస క‌ళ్యాణం. నితిన్- రాశీఖ‌న్నా న‌టించిన ఈ సినిమా పెళ్లి కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. `శ‌త‌మానం భ‌వ‌తి` ఫేం స‌తీష్ వేగేష్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అగ్ర‌నిర్మాత‌ దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నితిన్ - రాశీ పెళ్లి వేడుక పోస్ట‌ర్లు ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఆగ‌స్టు 9న ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయ‌నున్నారు. హ్యాపి వెడ్డింగ్ యావ‌రేజ్ అన్న టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్‌కి వ‌స్తున్న‌ సినిమాలు అయినా కె.రాఘ‌వేంద్ర‌రావు `పెళ్లి సంద‌డి` రేంజు హిట్లు అవుతాయా? అన్నది వేచి చూడాలి.