'మైహోమ్' రామేశ్వర రావు ఇంట పెళ్లి సందడి 

'మైహోమ్' రామేశ్వర రావు ఇంట పెళ్లి సందడి 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. రామేశ్వర్ రావు సోదరుడు జగపతి రావు కుమార్తె శ్రీ లక్ష్మీ, న్రుపుల్‌తో ఏడడుగులు వేసింది. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్‌టీవీ చైర్మెన్ నరేంద్ర చౌదరి, ఈనాడు అధినేత రామోజీరావు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.