ప్రియరాలి కోసం సొరంగాన్ని తవ్విన ప్రియుడు... షాకైన భర్త 

ప్రియరాలి కోసం సొరంగాన్ని తవ్విన ప్రియుడు... షాకైన భర్త 

అక్రమ సంబంధాలు ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయో చెప్పక్కర్లేదు.  బయటపడనంత వరకు ఇలాంటివి బాగానే ఉంటాయి.  ఒక్కసారి బయటపడితే దానివలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో అందరికి తెలుసు.  ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం తన ఇంటి నుంచి ప్రియురాలి ఇంటి వరకు సొరంగం తవ్వాడు.  ప్రియురాలి భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత ప్రియుడు సొరంగ మార్గంద్వారా ప్రియురాలి ఇంటికి రావడం, ఆమెతో రాసలీలలు సాగించడం చేస్తున్నాడు.  అయితే, ఓ రోజు అనుకోకుండా ప్రియురాలి భర్త త్వరగా ఇంటికి వచ్చాడు.  ఇంట్లోకి వచ్చిన భర్త, ఇంట్లో జరుగుతున్నా తతంగం చూసి షాక్ అయ్యాడు.  అయితే, అక్కడి నుంచి తప్పించుకున్న ప్రియుడు గదిలోని ఫాఫా వెనక్కి వెళ్లి మాయం అయ్యాడు.  భర్త కూడా సోఫా వెనక్కి వెళ్లి చూడగా అక్కడ ఓ సొరంగం కనిపించింది.  అందులో నుంచి లోపలికి వెళ్లిన భర్తకు షాకింగ్ విషయాలు తెలిసాయి.  భార్యను కలుసుకునే ప్రియుడి ఇంటి వరకు సొరంగం ఉన్నట్టు గుర్తించాడు.  సొరంగం నేరుగా ప్రియుడి ఇంట్లోకి ఉన్నది.  ప్రియుడిపైన, భార్యపైనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.  ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ సంఘటన మెక్సికోలో జరిగింది.  సొరంగాన్ని సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.