అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..!

 అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..!

అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు  తెలిపిన వివరాల ప్రకారం...  కాగజ్‌నగర్‌కు చెందిన ఇగురపు చంద్రయ్య, సుందరి దంపతుల కుమారుడు దినేష్‌ (29) జైపూర్ కు చెందిన అమలను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో దినేష్ కు సింగరేణి ఉద్యోగం పెట్టిస్తామని హామీ ఇచ్చిన అత్తింటివారు ఏళ్ళు గడుస్తున్నా ఉద్యోగం పెట్టించలేదు. అంతేకాకుండా అత్తింట్లో దినేష్ కు మర్యాద కూడా కరువయ్యింది. ఈ క్రమంలో అమల, దినేష్ మధ్య తరచూ గొడవలు జరగటం మొదలయ్యింది. కాగా ప్రస్తుతం దినేష్ తన భార్యతో కలిసి సీసీసీ లో నివాసం ఉంటున్నాడు. ఇద్దరిమధ్య గొడవ జరగటంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దాంతో మనస్థాపానికి గురైన దినేష్ మందమర్రి సమీపంలో రైల్వే లైన్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి బంధువులు దినేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆరోపిస్తున్నారు. దాంతో  పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.