కూతురు పుట్టిందని ఆనందించాడు...తండ్రి కాదని తెలిసి షాక్ అయ్యాడు... 

కూతురు పుట్టిందని ఆనందించాడు...తండ్రి కాదని తెలిసి షాక్ అయ్యాడు... 

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  హ్యాపీగా జీవితం సాగుతున్నది.  అమ్మాయి తల్లి అయ్యింది.  ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.  ఇది తెలిసి భర్త ఆనందించారు.  కానీ, బ్లడ్ రిపోర్ట్, డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి చూసి షాక్ అయ్యాడు.  భార్యకు పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదని తెలిసి షాక్ అయ్యాడు.  భార్య అక్రమ సంబంధం వలన పుట్టిన బిడ్డగా వైద్యులు చెప్పడంతో ప్రేమించిన భార్యపై కోపగించుకున్నారు.  

అయితే, బిడ్డకు అసలు తండ్రి ఎవరు అని పోలీసులు ఆరా తీయగా విషయం తెలిసి షాక్ అయ్యారు.  ఆమె బిడ్డకు తండ్రి 13 ఏళ్ల యువకుడు అని తెలిసి పోలీసులకు మతిపోయింది.  మైనర్లతో అక్రమ సంబంధాలు యూకే చట్టాల ప్రకారం నేరం.  ఇలాంటి వాటికి అక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయి.  అయితే, భార్య మాత్రం బిడ్డ తన భర్త వలనే పుట్టాడని చెప్తోంది.  రిపోర్టులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి.  ఓ రోజు ఆమె మద్యం సేవించి బాలుడు ఉన్న ఇంటికి వెళ్ళింది.  అక్కడ ఇద్దరు కలిసి యూట్యూబ్ లో వీడియోలు చూశారట.  అలా వీడియోలు చూసిన తరువాత శారీరకంగా కలిశారు.  ఆ తరువాత చాలాసార్లు అలా కలిసినట్టుగా బాలుడు చెప్తున్నాడు.  కానీ ఆ మహిళ మాత్రం అలాంటిది ఏమి లేదని చెప్తూ బుకాయించింది.  ఈ కేసు ప్రస్తుతం యూకేలో వైరల్ గా మారింది.