ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే... అలా ఎలా జరిగింది...!!

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే... అలా ఎలా జరిగింది...!!

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగడం గొప్ప విషయం.  అందరూ ప్రేమిస్తారు.  కానీ, కొందరే అందులో విజయం సాధిస్తారు.  ఇలా ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఏమైందో ఏమో తెలియదు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.  

మీరట్ లో దుష్యంత్ గిరి అనే వ్యక్తి పెట్రోల్ బంకులో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు.  ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.  అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.  అందరూ కలిసి వెళ్తూ... ఓ హోటల్ దగ్గర ఆగి టీ చెప్పారు.  అందరూ టీ తాగుతుండగా పెళ్లి కొడుకు మిస్ అయ్యాడు.  ఎక్కడి వెళ్ళాడో తెలియక వెతికి చివరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.  పెళ్ళికొడుకు దుష్యంత్ చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్టు యువకుడి సోదరుడు చెప్పడంతో పెళ్లి ఇంట విషాదం నెలకొన్నది.  ఎందుకు దుష్యంత్ అలా ఉరేసుకోవాల్సి వచ్చిందో అని పోలీసులు ఆరాతీస్తున్నారు.