దారుణం:  అత్తింట్లో కరోనా వేధింపులు... భార్య ఆత్మహత్య... 

దారుణం:  అత్తింట్లో కరోనా వేధింపులు... భార్య ఆత్మహత్య... 

కరోనా వైరస్ ఎటు నుంచి ఎలా వచ్చి కాటేస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.  ఒంట్లో బాగున్నట్టుగానే ఉంటుంది. ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించవు కానీ చెక్ చేస్తే కరోనా వచ్చినట్టు తేలుతోంది.  ఇలా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు.  కరోనా సోకితే అదేదో తగ్గని రోగం మాదిరిగా కొంతమంది ఇంట్లో ఉండే వారిని అవమాన పరుస్తున్నారు.  చులకనగా చూస్తున్నారు.  వెలేసినట్టుగా చూస్తున్నారు.  దీంతో కరోనా వ్యాధి వచ్చింది అనే దానికంటే, ఎదురు వ్యక్తులు చూసే చులకన భావంతోనే ఎక్కువగా మంది మరణిస్తున్నారు.  

ఇలానే నెల్లూరులో  ఓ సంఘటన జరిగింది.  ఐదేళ్ల క్రితం ఓ యువతికి పెళ్లి జరిగింది.  ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు.  దీంతో ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి.  పైగా అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.  అదే సమయంలో బంధువుల్లో ఒకరికి కరోనా వచ్చింది. అనుమానంతో కోడలికి కూడా పరీక్ష చేయించారు.  ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఆమెను ఓ గదిలో ఉంచారు.  సరిగా చూడటం లేదు.  సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు.  శనివారం రోజున కోడలిని గదిలోనే ఉంచి, కుటుంబం మొత్తం కావలి వెళ్ళింది.  అక్కడి నుంచి ఆమె భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదట.  అనుమానంతో ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, భార్య విగతజీవిగా పడుంది.  సూటిపోటి మాటలతో బతికే కంటే చనిపోవడం మేలు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అమ్మాయితరపు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.