చాహల్‌ను అనకూడని మాటన్న గప్తిల్‌ !

చాహల్‌ను అనకూడని మాటన్న గప్తిల్‌ !

న్యూజిలాండ్‌తో రెండో టీ20 తర్వాత కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌, టీమిండియా స్పిన్‌ బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ మధ్య ఒక హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ పూర్తయ్యాక గప్టిల్‌, రోహిత్‌ శర్మ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. చాహల్‌ వారి మధ్యకెళ్లి ఏం జరుగుతోందని అడిగాడు. వెంటనే గప్టిల్‌ చాహల్‌నుద్దేశించి హిందీలో అనకూడని ఓ మాట అన్నాడు. దీంతో పక్కనే ఉన్న రోహిత్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ ఘటనంతా లైవ్‌లో రికార్డు అయింది. అయితే, తెలిసీ తెలియని భాషలో మార్టిన్‌ అలా అనడంతో అక్కడున్న టీమిండియా ఆటగాళ్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

ఇక నిన్నటి టీం ఇండియా జట్టు న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.  133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు కేవలం  మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓటర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్ కే వెనుదిరిగా శ్రేయాస్, రాహుల్ లు నిలకడగా ఆది మూడో వికెట్ కు 86 పరుగులు రాబట్టారు.  న్యూజిలాండ్ బౌలర్లను ధాటిగా ఎదురుకొంటూ వీలు దొరికినప్పుడల్లా బౌండీరీలు కొడుతూ మ్యాచ్ ను గెలిపించారు.  దీంతో టీం ఇండియా 2-0 ఆధిక్యంలో ఉన్నది.  ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలో టీం ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు న్యూజిలాండ్ పై కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది.