ఆ విషయంలో త్రివిక్రమ్ నిర్మాతలను ఒప్పించిన మారుతి

ఆ విషయంలో త్రివిక్రమ్ నిర్మాతలను ఒప్పించిన మారుతి

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో  శైలజా రెడ్డి  అల్లుడు అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.  ఈ సినిమాకు సంబంధించి ఓవర్సిస్ హక్కులను ఎవరికి  ఇవ్వాలి అనే దానిపై పెద్ద వాదనే జరిగినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం హారిక  అండ్ హాసిని నిర్మాణంలో మూడు సినిమాలు వస్తున్నాయి.  ఇందులో ఒకటి ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ.  ఈ సినిమా హక్కులను ఎల్ఏ తెలుగు సొంతం చేసుకున్నది.  ఒప్పందం ప్రకారం మిగతా రెండు సినిమాలను కూడా ఎల్ఏ తెలుగుకు ఇవ్వాలని హారిక అండ్ హాసిని నిర్మాతలు భావించారు. 

కానీ, శైలజారెడ్డి అల్లుడు దర్శకుడు మారుతి మాత్రం అందుకు ససేమిరా అన్నారు.  శైలజా రెడ్డి అల్లుడు ఓవర్సిస్ హక్కులను ఐ డ్రీమ్ కు ఇవ్వాలని పట్టుబట్టాడు.  దర్శకుడు, నిర్మాతలకు మధ్య చాలా తతంగమే నడిచింది.  ఎలాగైతేనేం చివరకు మారుతి మాటకు కట్టుబడి ఓవర్సిస్ హక్కులను ఐడ్రీమ్ కు ఇచ్చేనందుకు ఓకే చేశారట.  ఈ విధంగా మారుతి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.