వేగనార్ 2019 బుకింగ్స్ ప్రారంభం

వేగనార్ 2019 బుకింగ్స్ ప్రారంభం

ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ తన నూతన 'వేగనార్ 2019' బుకింగ్స్ ను ప్రారంభించింది. మూడవ జనరేషన్ వేగనార్ బుకింగ్స్ ను దేశ వ్యాప్తంగా సోమవారం కంపెనీ ప్రారంభించింది. రూ. 1,100 వేలు టోకెన్ చెల్లించి కంపెనీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త వేగనార్ ఈ నెల 23న వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. స్పేస్, కంఫర్ట్ లో ఈ కొత్త మోడల్ వేగనార్ ఇంతకుముందు వాటికంటే బాగుంటుందని కంపెనీ తెలిపింది.

ఈ మోడల్ కారు కే సిరీస్ ఇంజిన్ తో మార్కెట్ లోకి వస్తుంది. సరికొత్త సౌండ్ సిస్టంను కూడా ఇందులో అమర్చారు. ఐదవ జనరేషన్ హార్ట్ టెక్ట్ టెక్నాలజీతో రూపొందించబడింది. పాత మోడల్ తో పోల్చుకుంటే ఇందులో సేఫ్టీపై ఎక్కువ శ్రద్ద చూపించారు. అంటి లాక్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్, స్పీడ్ అలెర్ట్ సిస్టం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.