కారు కొనాలనుకుంటున్నారా..? అయితే షాకింగ్ న్యూసే..!

కారు కొనాలనుకుంటున్నారా..? అయితే షాకింగ్ న్యూసే..!

కొత్త సంవత్సరంలో.. కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. ఇది మీకు షాకింగ్‌ న్యూసే.. ఎందుకంటే.. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచింది. వివిధ మోడళ్ల ధరలు రూ.34 వేల వరకు పెరిగినట్లు ప్రకటించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయంతో ధరలను పెంచక తప్పలేదని స్పష్టం చేసింది మారుతి సుజుకీ.. మోడల్ ప్రాతిపదికన కార్ల ధర రూ.34 వేల వరకు పెంచినట్టు సోమవారం రోజు ప్రకటించింది.. కాగా, మారుతీ సుజుకీ గత నెలలోనే కార్ల ధరలు పెంచుతామని ప్రకటించింది.. కరోనా సమయంలో.. కార్ల కొనుగోళ్లు భారీ సంఖ్యలో పడిపోయినా..  ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి.. డిసెంబర్ నెలలో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు ఇప్పటికే ప్రకటించింది ఆ సంస్థ.. మొత్తంగా కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును వెచ్చించాల్సి వస్తుందన్నమాట.