ప్రణయ్‌ హత్య కేసు: మారుతీరావుకు బెయిల్‌

ప్రణయ్‌ హత్య కేసు: మారుతీరావుకు బెయిల్‌

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్‌ మంజూరైంది. మారుతీరావుతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి కూడా బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

భార్య అమృతతోపాటు ఆస్పత్రికి వెళ్లివస్తుండగా గత ఏడాది సెప్టెంబరు 14న ప్రణయ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అమృత తండ్రి తిరునగరి మారుతీరావు సుపారి ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు పోలీసులు కూడా స్పష్టం చేశారు. నిందితులు ఎప్పటికప్పుడు బెయిల్‌ కోసం పిటిషన్‌లు దాఖలు చేస్తున్నా న్యాయస్థానం తోసిపుచ్చింది. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌ మంజూరు చేసింది.  మారుతీరావు 7 నెలల నుంచి వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు.