రెహ్మాన్ మార్వెల్ థీమ్ సాంగ్ పై విమర్శలు

రెహ్మాన్ మార్వెల్ థీమ్ సాంగ్ పై విమర్శలు

ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ అందించే సంగీతం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లదు.  ఒకవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే మరోవైపు పాప్ ఆల్బమ్స్ కూడా చేస్తూ బిజీగా మారిపోయాడు.  ఈ మధ్యకాలంలో రెహ్మాన్ అందిస్తున్న సంగీతం కొంత తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఒకప్పుడు రెహ్మాన్ మ్యూజిక్ అంటే అది స్లో పాయిజన్ గా ఎక్కేసేవి.  ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.  

2 పాయింట్ 0 సినిమా మ్యూజిక్ విషయంలో అదే జరిగింది.  ఇప్పుడు మార్వెల్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అవెంజర్స్ ది ఎండ్ గేమ్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను రెహ్మాన్ కంపోజ్ చేశారు.  ఈ థీమ్ సాంగ్ ను రీసెంట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, 24 గంటల వ్యవధిలో మిలియన్ వ్యూస్ ను దాటిపోయింది.  మార్వెల్ వంటి సంస్థ నుంచి వస్తున్న థీమ్ సాంగ్ కావడంతో ఎన్నో అంచనాలు ఉంటాయి.  ఈ అంచనాలను అందుకోవడంలో రెహ్మాన్ సాంగ్ విఫలం అయింది.  గతంలో వందేమాతరం వంటి సాంగ్ ను కంపోజ్ చేసి భారతీయుల హృదయాలను దోచుకున్న సంగీత దర్శకుడు ఇలాంటి సాంగ్ ను ఇస్తాడని ఎవరు ఊహించలేదు.  సాంగ్ చాలా బాగుంది అని చెప్పలేము.. అలాగే బాగాలేదు అని చెప్పలేము.  ఫర్వాలేదు ఒకే అనిపించుకుంది.