బ్రహ్మను మించిన పెన్సిల్ బ్రహ్మ (ఫొటోలు)

బ్రహ్మను మించిన పెన్సిల్ బ్రహ్మ (ఫొటోలు)

ఈ ఫొటోలు చూడండి. బావున్నాయి కదా. కానీ అవి ఫొటోలు కాదు. అక్షరాలా కలర్ పెన్సిల్స్ తో గీసిన బొమ్మలు మాత్రమే. కెమెరా కంటితో చెక్కినంత ఇంపుగా ఎంత స్వచ్ఛంగా, నిజాయతీగా ఉన్నాయో చూశారు కదా. ఈ పెన్సిల్ కళాకారుడి పేరు శశికాంత్ ధోత్రే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా శిరాపూర్ గ్రామానికి చెందిన యువకుడు. ఆయన పెన్సిల్ నుంచి జాలువారే బొమ్మలు ఆ బ్రహ్మను మరిపించాయో లేదో తెలీదు కానీ.. కళాకారుల హృదయాలను మాత్రం కొల్లగొట్టాయి. అందుకే అనేక అవార్డులు ఆయన్ని వరించాయి. ఎన్నో షో లు నిర్వహించాడు. ఆ బొమ్మల్లోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించండి.