పీవీ సింధుకు అరుదైన గౌరవం

 పీవీ సింధుకు అరుదైన గౌరవం

తెలుగు తేజం, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి కొత్త రికార్డులు సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కనుంది. దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం పీవీ సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. మరోవైపు ప్రపంచ బాక్సింగ్‌లో తనదైన ముద్రవేసిన మేరికోమ్‌ను రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఒక క్రీడాకారిణి పేరును సిఫారసు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పద్మశ్రీ అవార్డుకు అర్హులుగా మరో తొమ్మిది మంది క్రీడాకారుల పేర్లను పంపింది. వీరిలో ఏడుగురు మహిళలే ఉండడం విశేషం. అవార్డు విజేతలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు.