ఖిలాడీ అప్‌డేట్.. దూసుకెళ్తున్న మాస్ మహారాజా

ఖిలాడీ అప్‌డేట్.. దూసుకెళ్తున్న మాస్ మహారాజా

మాస్ మహరాజ్ రవితేజ మంచి దూకుడు చూపిస్తున్నాడు. సంక్రాంతికి క్రాక్ సినిమాతో అందరిని అలరించాడు. అయితే రానున్న రవితేజ పుట్టిన రోజు నాడు అభిమానులకు ఎటువంటి బహుమతి ఇస్తాడన్న విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఉంది. రవితేజ వరుస ప్లాప్‌లు చవిచూస్తున్న వేళ గోపీచంద్ మలినేని క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ అందించాడు. దాంతో రవితేజ మళ్లీ ఊపందుకున్నాడు. ప్రస్తుతం రవి ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెలుస్తోంది. ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే జనవరీ 26న ఖిలాడీ సినిమా నుంచి అప్‌డేట్ పక్కా ఉంటుందని, అది కూడా జనవరీ 26 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అభిమానులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ వస్తుందని ప్రకటించారు. అది కూడా ఏ లుక్, పోస్టర్ కాదు, ఏకంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నామని తెలిపారు. దాంతో అభిమానులంతా ఈ గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.