మాస్ మహారాజా ఫుల్ జోష్ .. కారణం

మాస్ మహారాజా ఫుల్ జోష్ .. కారణం

మాస్ మహారాజ నటించిన నేల టిక్కెట్టు సినిమా పరాజయం పాలైంది.  టైటిల్ పరంగా పక్కా మాస్ హిట్ అవుతుందని అనుకున్నా సినిమా, కొన్ని  కారణాల వలన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.  టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు వరసగా ఫెయిల్ అయ్యాయి.  ఈ రెండింటి తరువాత ఇప్పుడు రవితేజ శ్రీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోని, సంతోష్ శ్రీవాస్ తో తేరి సినిమా రీమేక్ లోను నటిస్తున్నారు.  అలాగే, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  రెండు వరస పరాజయాలు వచ్చినప్పటికీ రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.  ఈ మూడు మంచి విజయాన్ని సాధిస్తాయని ధీమాతో ఉన్నాడు రవితేజ.  

నేల టిక్కెట్టు పరాజయం నుంచి బయటపడేందుకు రవితేజ తన ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్ వెళ్ళాడు.  ప్రస్తుతం అక్కడ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు.  అక్కడి నుంచి తిరిగి రాగానే, రవితేజ యుఎస్ లో జరిగే అమర్ అక్బర్ ఆంటోని షూటింగ్ లో పాల్గొంటాడు.  ఈ విధంగా రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు.