వినయ విధేయ రామలో మాస్ ఐటెమ్..!!

వినయ విధేయ రామలో మాస్ ఐటెమ్..!!

వినయ విధేయ రామ సినిమా టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయింది.  ఇందులో సాంగ్స్ ను కూడా షూట్ చేస్తున్నారు.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  బోయపాటి సినిమా అనగానే ఓ మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుంది.  అందులో ఎలాంటి  సందేహం లేదు.  చరణ్ లాంటి మాస్ హీరోకు ఎలాంటి సాంగ్ ఉంటుందో అనే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సాంగ్ గురించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.  

ఇందులో మాస్ మసాలా సాంగ్ ఉంటుందట.  అది ఐటమ్ సాంగ్ కాదని, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్ అని అంటున్నారు.  మామూలుగానే దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి సాంగ్స్ చేయడంలో సిద్ధహస్తుడు.  చరణ్ లాంటి మాస్ హీరోకు ఇంకెలాంటి ట్యూన్ ఇస్తాడో చూడాలి.