జగన్‌, చంద్రబాబు మెజార్టీల్లో భారీ వ్యత్యాసం...

జగన్‌, చంద్రబాబు మెజార్టీల్లో భారీ వ్యత్యాసం...

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజార్టీల మధ్య భారీ వ్యత్యాసం నమోదైంది. శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు, కడప జిల్లా పులివెందుల నుంచి విపక్షనేత వైఎస్ జగమోహన్ రెడ్డిలు పోటీ చేసి గెలుపొందారు... అయితే, ఈ ఇరువురు నేతలకు లభించిన మెజార్టీలో చాలా తేడా కనిపిపిస్తోంది. 2004లో కుప్పంలో చంద్రబాబుకు 59,588 ఓట్ల మెజార్టీతో.. 2009లో 46,066 ఓట్ల మెజార్టీతో..  2014లో 47,121 ఓట్ల మెజార్టీతో ఇలా ప్రతీ ఏడాది మెజార్టీ పెరుగుతూ రాగా... ఈ సారి మెజార్టీ పడిపోయింది. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కేవలం 29,903 ఓట్ల మెజార్టీ మాత్రమే దక్కింది. ఇక వైఎస్ జగన్... 2014లో తొలిసారిగా పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేసి 75,243 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించగా... తాజాగా వెలువడిన ఫలితాల్లో అదే స్థానం నుంచి 90,543 ఓట్ల భారీ మెజార్టీతో తిరిగి గెలుపొందారు జగన్. అంటే... బాబు మెజార్టీ తగ్గిపోగా... జగన్ మెజార్టీ పెరిగింది.