చారిత్రాత్మక చర్చి అగ్నికి ఆహుతి..

చారిత్రాత్మక చర్చి అగ్నికి ఆహుతి..

12వ శతాబ్దానికి చెందిన అతిపురాతనమైన చర్చి ఆగ్నికి ఆహుతైంది. పారిస్‌లోని సేన్‌ నదీ తీరంలో ఉన్న ఈ చర్చిని నోత్ర్‌-దేమ్‌ కాథెద్రాల్‌గా పిలుస్తారు. గ్రీన్‌విచ్‌ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.50 గంటల సమయంలో చర్చి పైభాగంలో మొదట మంటలు ప్రారంభమయ్యాయి... చూస్తుండగానే గుమ్మటం చుట్టూ వ్యాపించాయి. ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న చర్చి.. గుమ్మటం, పైకప్పు కుప్పకూలిపోయాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరూ గాయపడలేదని తెలిపారు పోలీసులు. దాదాపు 850 ఏళ్ల కిందటి కట్టడం ఇది... ఇక మంటలను అదుపుచేయడానికి దాదాపు 400 మంది అగ్నిమాపకసిబ్బంది తీవ్రంగా శ్రమించారు.