సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం..

సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం..

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నేడు తెల్లవారుజామున 3:30 గంటలకు సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని టెర్మినల్స్ వద్ద వరుసగా మూడు పేళుల్లు సంభవించింది. పేలుడుతో భారీ శబ్దం రాగా.. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల పొడవున పొగ కమ్ముకుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారి ధావల్‌ పటేల్‌ తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  హైడ్రో కార్బన్‌ వాయువు లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.