ఆర్ఆర్ఆర్ హీరోను టార్గెట్ చేసిన మాస్టర్ డైరెక్టర్..

ఆర్ఆర్ఆర్ హీరోను టార్గెట్ చేసిన మాస్టర్ డైరెక్టర్..

టాలీవుడ్‌లో కోలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. అక్కడి స్టార్ హీరోలందరికీ తెలుగులో కూడా ఎంతో కొంత మార్కెట్ ఉంది. మునుముందు రోజుల్లో ఈ మార్కెట్ మరింత అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో కోలీవుడ్ హీరోలకే కాకుండా అక్కడి దర్శకులకు కూడా ప్రత్యేక గుర్తింపు అందుతోంది. వారు తెలుగు ప్రాజెక్ట్‌ల పై కూడా కన్నేస్తున్నారు. అయితే ప్రస్తుతం తమిళంలో సంచలనాలు సృష్టించేందుకు సిద్దమైన సినిమా మాస్టర్. ఈ సినిమా విజయ్ ఇళయదలపతి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలుగా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా అనేక రికార్డులను తిరగ రాసింది. ఇటువంటి సినిమాకు దర్వకత్వం వహించిన లోకేష్ కనగరాజన్‌కు కూడా ఎప్పుడు ఇతర భాషల పరిశ్రమల్లో గిరాకీ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దమవుతున్నాడట. అందుకుగాను ఓ స్టోరీ కూడా రెడీ చేశాడట. అయితే ప్రస్తుతానికి కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీఇవ్వనున్నాడట. ఇందులో భాగంగా తెలుగు స్టార్ హీరో రాంచరణ్‌కు తన కథను వినిపించాడట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ప్రస్తుతం రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత జెర్సీ దర్శకుడితో మరో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది వరకు కనగరాజన్, చెర్రీ కాంబో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.