'రాయుడు.. నా నంబర్‌ 4'

'రాయుడు.. నా నంబర్‌ 4'

మే 30న ప్రారంభమవనున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ కోసం అన్ని జట్లూ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి. ఫైనల్‌ 15లో ఎవరెవరు ఉండాలనే విషయమై ఇప్పటికే అన్ని జట్టూ ఓ అంచనాకు రాగా.. ఆ విషయంలో టీమిండియా మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. నంబర్‌ 4 స్థానంతోపాటు బ్యాకప్‌ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై క్లారిటీ మిస్‌ అయింది. ఈ గ్యాప్‌లో.. ఫైనల్‌ 15లో ఎవరెవరు ఉండాలన్నదానిపై  వెటెరన్ క్రికెటర్లు ఒక్కొక్కరూ ఒక్కోలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయమై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌ స్పందించాడు. 'నేనైతే రాయుడినే ఎంపిక చేస్తా. ఈ విషయంలో ఎందుకొంత ఆలోచన జరుగుతోందో అర్థం కావడం లేదు. కేఎల్‌ రాహుల్ బ్యాటింగ్‌ నాకు నచ్చుతుంది. కానీ నాలుగో స్థానానికి అతని కంటే రాయుడే బెస్ట్‌. రాహుల్‌కు అవకాశాలు భవిష్యత్తులో వస్తాయి. ఒకవేళ రాహుల్‌ను ఎంపిక చేయాలనుకుంటే బ్యాకప్‌ ఓపెనర్‌గా పనికొస్తాడు' అని అన్నాడు. 

ఇక.. టీమ్‌లో ఖాళీ ఉన్న ఈ ఒకే స్పాట్‌పై చాలా మంది ఆటగాళ్లే ఆశలు పెట్టుకున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తే నంబర్ 4 తమదే అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఐపీఎల్‌లో రాణిస్తే వరల్డ్ కప్‌ బెర్త్‌ ఖాయమని అజింక్యా రహానె చెప్పగా.. ఈ టోర్నీలో సత్తా చాటితే సెలక్టర్లను ఆకట్టుకోవచ్చిని శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు.