వియ్యమందుకోనున్న కాంగ్రెస్-బీజేపీ నేతలు

వియ్యమందుకోనున్న కాంగ్రెస్-బీజేపీ నేతలు

కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వియ్యం అందుకోబోతున్నారు. అయితే సంబంధాలు కలుపుకోవడం అనేది కుటుంబాల వరకే పరిమితం అవుతుందా  లేక పార్టీలుగా కూడా కలిసిపోతారా అన్నదానిపై చర్చలు జరుగుతున్నా.. అది తేలాలంటే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.  

కుమారస్వామి సర్కారులోమున్సిపల్ శాఖ మంత్రిగా పని చేస్తున్న రమేశ్ జర్కిహోలి రెండో కుమారుడికి ప్రముఖ బీజేపీ నేత, ఎమ్మెల్యే శ్రీరాములు కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు రెండు కుటుంబాల మధ్య ఇప్పటికే ఓ అవగాహన కూడా కుదిరిందని సమాచారం. రమేశ్ కుమారుడు ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్నాడు. నేతలిద్దరూ వాల్మీకి సమాజానికి చెందినవారే కావడంతో వియ్యానికి మార్గం సుగమం అయిందని చెప్పుకుంటున్నారు.