మయాంక్ మళ్లీ సెంచరీ

మయాంక్ మళ్లీ సెంచరీ

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోర్‌తో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్ అగర్వాల్.. పుణె వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. 183 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్.. వరుసగా ఒకే సిరీస్‌లో రెండో టెస్ట్ లోనూ సెంచరీ బాదడం విశేషం. అయితే సెంచరీతో తర్వాత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు మయాంక్... 108 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు.. రబడా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మయాంక్. ఇక, 64.4 ఓవర్లలో 200 పరుగులు చేసింది టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రహానే క్రీజ్‌లో ఉన్నారు.