రెండో సెషన్ రెండో బంతికే మయాంక్ ఔట్...

రెండో సెషన్ రెండో బంతికే మయాంక్ ఔట్...

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత జట్టు ను గట్టిగా దెబ్బ తీస్తుంది ఆస్ట్రేలియా. మొదటి సెషన్ పూర్తయిన తర్వాత 161 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత రెండో బంతికే మయాంక్ అగర్వాల్(38) రూపంలో మరో వికెట్ చేజార్చుకుంది. దాంతో వికెట్ కీపర్ పంత్ తో  కలిసి బ్యాటింగ్ చేసేందుకు వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ తో రాణించిన సుందర్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లో ఏం చేస్తాడో చూడాలి.