మయాంక్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు..!

మయాంక్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు..!

ఇండోర్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించారు భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. తొలిఇన్సింగ్స్‌లో 243 బంతుల్లో డబుల్ సెంచరీ బాదేసిన మయాంక్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో.. ఆసీస్ లెజెండ్ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్‌ రికార్డును బద్దలు కొట్టాడు. బ్రాడ్‌మన్ 13 ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయగా.. మయాంక్ అగర్వాల్ 12 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక, ఈ అరుదైన లిస్ట్‌లో వినోద్ కాంబ్లీ టాప్‌లో ఉన్నాడు.. తొలి ఐదు ఇన్నింగ్స్‌లలోనే రెండు డబుల్ సెంచరీలతో కాంబ్లీ రికార్డు నెలకొల్పాడు. కాగా, 243 వ్యక్తిగత పరుగుల దగ్గర మయాంక్ పెవిలియన్ చేరాడు.. 330 బంతులు ఎదుర్కొన్న మయాంక్.. 28 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇక, పూజారా 54, రహానె 86, జడేజా 60 పరుగుల చేయగా.. తొలి ఇన్సింగ్స్‌లో టీమిండియా 114 ఓవర్లు పూర్తి అయ్యే సరికి ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది.