మమతను వారిద్దరూ టార్గెట్‌ చేశారు: మాయ

మమతను వారిద్దరూ టార్గెట్‌ చేశారు: మాయ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు.. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్‌ చేశారని బీఎస్పీ అధినేత్రి యామావతి అన్నారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రమాదకరం, ఆందోళనకరం అని అన్నారు. ఇవాళ మాయావతి మీడియాతో మాట్లాడారు.

బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజు ముందుగానే ముగించాలని ఈసీ నిర్ణయిం తీసుకోవడంపై ఆమె స్పందించారు. 'ఇవాళ బెంగాల్‌లో మోడీ సభలు రెండున్నాయి. మధ్యాహ్నం, సాయంత్రం ఈ సభలుంటాయి. కానీ ఈ సభలు ముగిసిన తర్వాతే ప్రచారంపై నిషేధం అమలయ్యేలా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిష్పక్షికంగా వ్యవహరించాలనుకుంటే.. మోడీ సభలు ప్రారంభానికి ముందే నిషేధం విధించాలి కదా?' అని ప్రశ్నించారు. ఈసీ కూడా మోడీ ఒత్తిడికి తలొగ్గుతోందని మాయావతి అభిప్రాయపడ్డారు.