జిహెచ్ఎంసి మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక

జిహెచ్ఎంసి మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక

హైదరాబాద్ మేయర్ గా కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి దాదాపు ఖరారయ్యారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా విజయలక్ష్మి రెండోసారి గెలవగా... మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా తొలి సారి గెలిచారు. బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి బరిలోకి దిగగా బీజేపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శంకర్ యాదవ్ బరిలోకి దిగారు. అయితే ముందు రవి చారి పోటీ చేయాలనీ భాబించినా ఆయన రావడం లేట్ కావడంతో అనూహ్యంగా శంకర్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక ఎంఐఎం ఎలాంటి అభ్యర్ధులను ప్రతిపాదించకుండానే రెండు పదవులకి టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. గెలిచే సంఖ్యా బలం లేకున్న బీజేపీ ఎందుకు పోటీ చేస్తుందనే చర్చ జరుగగా బీజేపీ నేతలు.. తాము ఎందుకు పోటీ చేస్తున్నామో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ప్రజలు బీజేపీ వ్యక్తిని మేయర్‌గా చూడాలనుకున్నారని అందుకే తమ పార్టీ 4 స్థానాల నుండి 48 స్థానాలకి చేరుకుందని అంటున్నారు. టీఆర్ఎస్ కి కూడా మెజారిటీ సీట్లు రాలేదని.. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్నా.. సగం సీట్లను దాటే పరిస్థితి లేదనేది బీజేపీ వాదన.  ఆ పార్టీకి ఏక పక్షంగా మేయర్ పదవిని అప్పగించొద్దని భావించిన కాషాయ పార్టీ నేతలు, గ్రేటర్ ప్రజలు వాళ్లకు పట్టం కట్టలేదనే విషయాన్ని గుర్తు చేసేందుకే తమ అభ్యర్థిని బరిలో పెట్టాలని నిర్ణయించామని  చెబుతున్నారు.