ప్రకటనలకు డబ్బులున్నాయి కానీ డాక్టర్ల జీతాలకు లేవు: సత్యేందర్ జైన్

ప్రకటనలకు డబ్బులున్నాయి కానీ డాక్టర్ల జీతాలకు లేవు: సత్యేందర్ జైన్

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా కారణంగా దేశం విలవిలలాడుతోంది. ఇటువంటి సమయాల్లో కూడా డాక్టర్లు ప్రజలను కాపాడేందుకు రోజుకు 18 నుంచి 20 వరకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి జీతాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవని దాటేస్తున్నారని ఢిల్లీ డాక్టర్లూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్రంలోని డాక్టర్ల జీతాలపై హెల్త్ అండ్ అర్బన్ డవలెప్‌మెంట్ మినిస్టర్ స్పందించారు. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని ఎవరు రక్షిస్తున్నారో మీకు తెలీదా వారికి జీతాలు ఇవ్వడానికి మీకు చేతులా రావడం లేదా అని నిలదేశారు. ‘ కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి డాక్టర్లు రక్షణ కవచాల్లో దేశ ప్రజలను కాపాడుతున్నారు. వారికి సరైన సమయానికి జీతాలు లేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎమ్‌సీడీ) వద్ద హోర్డింగ్‌లు కట్టడానికి నిధులు ఉంటాయి కానీ, డాక్టర్ల జీతాలు ఇవ్వడానికి నిధులు ఉండవ’ని ఆగ్రహం వ్యక్తపరిచారు. డాక్టర్లకు ఎమ్‌సీడీ జీతాలు ఇవ్వాలని, మరి ఆ డబ్బులను ఎక్కడ ఖర్చు చేస్తుందో తెలియడం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎమ్‌సీడీ సరిగా పనిచేయడం లేదని, హాస్పట్లను ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుతూ బీజేపీకి లేఖ రాసినట్లు తెలిపారు.