అమెరికన్ మెనూలో మెక్ ఆలూ టిక్కీ

అమెరికన్ మెనూలో మెక్ ఆలూ టిక్కీ

తమ శాకాహార కస్టమర్లు ఇష్టపడే ఆహారాన్ని ప్రవేశపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్ చెయిన్ మెక్డొనాల్డ్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. గత నెల ఫాస్ట్ ఫుడ్ చెయిన్  మెక్‌ డొనాల్డ్స్‌ తన  చికాగో మెనూలో వెగాన్ బర్గర్ ను చేర్చింది. ఇప్పటి వరకు భారతీయులు ఎంతో ఇష్టంగా తిన్న మెక్ ఆలూ టిక్కీ ఇప్పుడు అమెరికాలోని మెక్డొనాల్డ్స్ మెనూలో స్థానం సంపాదించింది.

భారత్ లో మెక్ ఆలూ టిక్కీ బర్గర్ ను శాకాహార వర్గంలో చేర్చిన మెక్డొనాల్డ్స్, ఇతర దేశాలలో మాత్రం దీనిని వెగాన్ ఆహారంగా మార్కెట్ చేస్తోంది. ‘మొక్కల ఆధారిత ప్రొటీన్ పై మేము చాలా కాలంగా దృష్టి పెట్టామని’ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ స్ట్రాటజీ) లూసీ బ్రాడీ చెప్పారు. ఈ బర్గర్ లో  టోస్టెడ్ బన్, బంగాళదుంపలతో తయారు చేసిన మసాలా ముద్ద, ఎర్ర ఉల్లిగడ్డలు, టొమాటో ముక్కలు, భారతీయులు ఎంతో ఇష్టంగా తినే సమోసాలో వాడే దినుసులను వాడతారు.

‘భారతదేశంలోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లలో అందించే ఆహారం కోసం కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా కాలంగా వాళ్లు ఎంతో ఇష్టపడే మెక్ ఆలూ టిక్కీని అందిస్తుండటం ెంతో ఆనందంగా ఉందని’ మెక్డొనాల్డ్స్ యజమాని నిక్ కరావైట్స్ చెప్పారు. ప్రస్తుతం మెక్డొనాల్డ్స్ హాంకాంగ్, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, యుకె, నార్వే ప్రాంతాల్లో అందించే వెగాన్ బర్గర్లను ఇతర ప్రాంతాల్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది.