సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతి

సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతి

సిద్దిపేట జిల్లా మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయాక.. కొన్ని కొత్త జిల్లాలు ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాకు మెడికల్ కాలేజీ అనుమతి ఇచ్చింది ఎంసీఐ. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో 2018-19 సంవత్సరానికి 150 సీట్లతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కానుంది. అనుమతి రావడంతో తెలంగాణ మంత్రి హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలల్లో సిద్దిపేట మెడికల్ కాలేజీ ఒకటి.

Photo: FieShot